గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో పెనుదుమారం రేపిన లీకేజీ ఘటన కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు ఈనెల 11న నిర్వహించనుంది. 2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనను వెలువరించింది టీఎస్‌పీఎస్సీ. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి ఈనెల 11న నిర్వహించనున్నారు.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్