స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్లో ప్రమాదంలో ఉన్న యువతిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సనిత కాపాడారు. ఫలక్ నామా – లింగంపల్లి ఎంఎంటీఎస్ ట్రైన్ కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న యువతిని పక్కకి లాగి రైల్వే పోలీస్ సనిత ప్రమాదం నుంచి తప్పించారు. బేగం పేట్ రైల్వే స్టేషన్లో నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన సనిత 2020 రైల్వే ఆర్పీఎఫ్ లో చేరారు. గతంలో కూడా బేగం పేట్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు మర్చిపోయిన లగేజ్ ని తిరిగి ఇవ్వడం లాంటి పనులు చేశారు. అత్యవసర సమయాల్లో అలెర్ట్ గా ఉండి ప్యాసింజర్ ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్ సనితను దక్షిణ మధ్య రైల్వే జీ ఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.
శభాష్… ప్యాసింజర్ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
0
377
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


