ఈసారి కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష..

స్వతంత్ర వెబ్ డెస్క్: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది. అయితే గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో కరెంట్‌ అఫైర్స్‌పై 13, ఎకనామిక్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌పై 11, చరిత్రపై 12, జనరల్‌ సైన్స్‌పై 3, ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌పై 17, ఎన్విరాన్‌మెంట్‌పై 20, భూగోళ శాస్త్రంపై 15, జీకేపై 9 మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయని నిపుణులు తెలిపారు.

ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా ఉందని, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కూడా సులువుగా రాసేవిధంగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి కటాఫ్‌ మార్కులు తగ్గే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నాటికి ఈ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్