స్వతంత్ర, వెబ్ డెస్క్: వైభవోపేతంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఏక్‌భారత్.. శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిభింభించేలా నిర్మించిన ప్రజాస్వామ్య నూతన సౌధాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ స్థానానికి సమీపంలో చారిత్రక రాజదండం సెంగోల్‌ను ప్రతిష్ఠాపన చేశారు. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ క్రమంలో పార్లమెంటును ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా భావిస్తున్న ప్రధాని: రాహుల్
0
263
Previous article
Latest Articles
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -


