స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మచిలీపట్నంలో రూ. 5వేల,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటగా తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. ఆతర్వాత బందరు పోర్టు పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను జెండా ఊపి ప్రారంభించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పూర్తి అవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది.
బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
0
482
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


