ఎన్టీఆర్ శతజయంతి వేడులకు తారక్ దూరం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దివంగత సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. కూకట్ పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రత్యేక అతిథిగా హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. వీరితో పాటు అన్నగారి మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టిడి జనార్థన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వేడుకలకు గైర్హాజరు అవుతున్నట్లు తారక్ టీమ్ ప్రకటన చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్ హాజరుకావడం లేదని తెలిపేందుకు చింతిస్తున్నామని పేర్కొంది. నేడు ఎన్టీఆర్ 40వ జన్మదినోత్సవం జరుపుకోవడంతో పాటు కుటుంబసభ్యులతో ముందుగా ప్లాన్ చేసుకున్న కమిట్మెంట్స్ వల్ల ఆయన ఈ కార్యక్రమానికి రావడం లేదని తెలిపింది. ఆహ్వాన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ఇదే విషయాన్ని తెలియజేశామని వెల్లడించింది.

కాగా ఈ వేడుకలకు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రామ్ లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సీనియర్ నటులు సుమన్, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ వంటి ప్రముఖులకు సైతం ఇన్విటేషన్ ఇచ్చారు. మరి వీరిలో ఎంతమంది హాజరు అవుతారో తెలియాలంటే వేచి చూడాలి.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్