స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటికబురు తెలిపింది. భగ్గున మండుతున్న ఎండలకు రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. రాగల 3 రోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు వారాలుగా ఉక్కపోతను భానుడి తాపానికి గురైన ప్రజలు కాస్త చల్లటి వాతావరణంతో ఊపిరిపీల్చుకోనున్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీ నుంచి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు
0
459
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


