స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లను అమరావతి కేసుతో పాటు కలిపి విచారించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే అమరావతి కేసును విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు ఆర్-5 జోన్ పిటిషన్ బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ బెంచ్ ఆదేశించింది. శుక్రవారంలోగా రెండు పిటిషన్లపై విచారణకు ఆ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అమరావతి కేసు అంశం మరో బెంచ్‌లో ఉన్నప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది.
ఆర్5 జోన్ పిటిషన్ అమరావతి కేసు ధర్మాసనానికి బదిలీ
0
390
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


