స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆనంద నిలయం వీడియో చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రెడ్డి(19) గుంటూరులో సీఏ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. ఇటీవల శ్రీవారి దర్శనార్ధం తిరుమల వచ్చిన రాహుల్ పెన్ కెమెరా సాయంతో ఆనందనిలయాన్ని వీడియో చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించామన్నారు. దర్శనానికి వచ్చిన టికెట్ ద్వారా ఆధార్ కార్డును సేకరించి అందులోని చిరునామా ఆధారంగా రాహుల్ అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా కొన్నిరోజుల క్రితం ఆనంద నిలయం చిత్రీకరించిన వీడియో బయటకు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తిరుమల ఆనంద నిలయం వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్
0
323
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


