స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: 70 ఏళ్ల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్ రాజుగా కింగ్ ఛార్లెస్-3 కిరీటాన్ని ధరించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో పట్టాభిషేకం వేడుక అట్టహాసంగా జరిగింది. దాదాపు 2వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే చేరుకున్న కింగ్ ఛార్లెస్‌ను కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ అతిథులకు పరిచయం చేశారు. అనంతరం చట్టాన్ని కాపాడతానని, న్యాయం, ధర్మంతో కూడిన పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. తదుపరి 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై ఆయన ఆశీస్సులైనారు. రాచరికాన్ని వదులుకుని రాజకుటుంబానికి దూరమైన ఛార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ కూడా పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరయ్యారు.
బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టం.. రాజుగా కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకం
0
423
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


