‘అపరమేధావి కేసీఆర్ గారు ఏం కట్టినా మహాద్భుతమే’: షర్మిల

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పాలనపై ఎప్పటికప్పడు ప్రశ్నిస్తూ.. రాష్ట్రప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల. ఎమ్మెస్సి పొలిటికల్ సైన్స్ చదివానని చెప్పే అపరమేధావి కేసీఆర్ గారు ఏం కట్టినా మహాద్భుతమే అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం కడితే.. ఒక్క వరదకే మునిగింది. దేశం మెచ్చిన యాదాద్రి కడితే.. చిన్నవానకే చిందరవందర. రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియేట్ కడితే.. గోడలకు బీటలు అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.

రెండు జల్లులకే నీటి ఎత్తిపోత. జనం మెచ్చిన పరీక్షలు పెడితే.. పేపర్ లీకులు.. సర్కారుకు లింకులు. సారు ఏం చేసినా ఏం కట్టినా.. అవినీతి చిట్టాలు.. అక్రమాల పుట్టలు.. నాణ్యతకు తిలోదకాలు… అంటూ అవినీతిపై ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణంపై పూర్తి దర్యాప్తు చేయాలి. అంతే కాకుండా భవన నాణ్యతపై పరిశీలన చేయించాలని మండిపడ్డారు.1600 కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

దొర గారికి ఢిల్లీ రాజకీయాల మీద ఉన్న సోయి.. తెలంగాణ రైతుల మీద లేదన్నారు. రైతులకు పరిహారం ఎగ్గొట్టి, వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిహారం పేరుతో మిర్చి రైతులను నిండా ముంచిండు.ఇప్పుడు వరి రైతులను నట్టేట ముంచాలని చూస్తుండు.పది రోజుల్లో పరిహారమని నెల రోజులైనా రూపాయి ఇవ్వలేదని ప్రశ్నించారు.

“అకాల వర్షాలకు 10లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా.. దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే. పంట నష్టం జరిగిన దానికి పరిహారం ప్రకటించకుండా తడిసిన ధాన్యం కొంటామని చెప్పి, మళ్లీ ఢిల్లీ పయణమైండు సారు. నష్టపోయిన రైతుల్లో సగం మంది కౌలు రైతులు ఉన్నా.. కనీసం పట్టింపు లేదు.రైతులు కన్నీరు పెడుతుంటే కల్లాల్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి.. దేశ దోపిడీకి ఢిల్లీకి పయణమైండు. ఇదేనా కిసాన్ సర్కారు? తెలంగాణ సంపదనంతా కొల్లగొట్టి ఇక్కడ గడీలు.. ఢిల్లీలో కోటలు కడుతుండు దొర.తడిసిన ధాన్యం కొనడమే కాకుండా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా” – వై.ఎస్. షర్మిల

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్