స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భవన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మ. 1:05 గంటలకు కార్యాలయ రిబ్బన్ కట్ చేసి ప్రవేశించారు. పార్టీ నూతన కార్యాలయంలో దుర్గామాత అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ లోని కుర్చీలో సీఎం ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పటు పలువురు నేతలతో కేసీఆర్ మొదటి సమావేశం కానుంది.
ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
0
296
Previous article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


