NCP అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. కొందరు కార్యకర్తలు అయితే రాజీనామా వద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీ తదుపరి అధ్యక్ష బాధ్యతలను ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

తన సమీప బంధువైన మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ NCPని వీడి బీజేపీలో చేరే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భిన్న సిద్దాంతాలు కలిగిన కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీగా అధికారం చేపట్టడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్