స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. అలాగే తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు సంభందించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు చేరుకోని ‘వైజాగ్ ఐటీ టెక్ పార్క్’ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సా. 4 గంటలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి చేరుకొని.. ఎంపీ కుమారుడు, దంపతులను ఆశీర్వదించనున్నారు.
సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే!
0
465
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


