మావోయిస్టుల దాడిలో 10 మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10మంది పోలీసులు, ఓ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల జాడ దొరకపోవడంతో కూంబింగ్ ముగించుకుని వస్తుండగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతేవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టుల అడ్డాగా ఉన్నాయి.

మావోయిుస్టల దాడిపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్పందించారు. మావోయిస్టుల దాడిలో అమరులైన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 11 మంది జవాన్లు మృతి చెందడం బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన మావోయిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరోవైపు  కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం  బఘేల్‌కు ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు.

 

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్