ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహతర్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆటోను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల కుటుంబసభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారికి ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ ఆదిలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారి వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించనున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

డిగ్రీలో 6 కొత్త కోర్సులు

తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో 6 కొత్త కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజెంట్‌ ట్రెండ్‌కు తగినట్టు కొత్త కోర్సుల రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్