రెండు రోజుల్లో గుడ్‌ న్యూస్‌ చెప్తానన్న కమల్‌ హాసన్‌

రెండురోజుల్లో గుడ్‌న్యూస్‌ చెప్తానని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సిద్ధమ వుతున్నామని… తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అధికార DMK – MNM మధ్య పొత్తుపై వార్తలు వస్తున్నాయి. దీని గురిం చి కొద్దినెలల క్రితం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచనప్రాయంగా పేర్కొన్నారు. అలాగే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో కమల్‌ మద్దతుగా నిలిచారు. గత ఏడాది జరిగిన ఈరోడ్‌ ఉప ఎన్నికలో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థిని MNM బలపరిచింది. 2018లో ఈ స్టార్‌ నటుడు MNM పార్టీని స్థాపించారు. 2019, 2021లో జరిగిన లోక్‌సభ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్