ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్‌ పర్యటన

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైసీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైసీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

       మొదటగా సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలియజే శారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ అధ్యక్షతన ఐదు ప్రాంతాల్లో కేడర్‌ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్‌ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Latest Articles

నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్‌ వ్యాఖ్యలు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్‌ ఫోన్ కాల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్