నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది..కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది..ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్టు ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పెంటలో జరిగింది.. గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు..వీరికి మొత్తం 8 మంది సంతానం..చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు.తనకు గత నాలుగు, ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, భార్య చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టు కుంది. కొద్ది సేపు గొడవ తర్వాత ఫైర్ లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టలు కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయ లుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్ కు చేరుకున్నాడు..ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతా నంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ, బయమ్మ, గొంతు నులిమి చంపేసింది..ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
0
538
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


