పశ్చిమగోదావరి జిల్లాను బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. వేల్పూరు గ్రామంలో జి కృష్ణానందం కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా గుర్తించి.. ఆ జోన్ లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు, గుళ్ల విక్రయాల షాపులను మూసివేశారు.. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణానందం కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లను జెసిబి సహాయంతో గోయి తీసి పడేస్తున్నారు. పిపి కిట్ల సహాయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, వేల్పూరు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫారాల వద్ద రెడ్ జోన్‌ను ప్రకటించారు. కిలోమీటర్ పరిధి వరకు రెడ్‌జోన్ ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లైన్స్ ప్రాంతంగా ప్రకటించారు. కోళ్లు, వాటి ఉత్పత్తుల రవాణాను నిషేధించినట్లు వెల్లడించారు. కోళ్ల వ్యాధి నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలలో ఈ వ్యాధి రాకుండా రాపిడ్ టీంలు చర్యలు తీసుకుంటున్నారు. కోళ్ల తరలింపు వాహనాల నియంత్రణకు రెడ్ జోన్‌లో రెండు పర్యవేక్షణ కేంద్రాలలో 4 చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఐదు కోళ్ల ఫారాలలోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో చంపి పూడ్చి పెడతామని అధికారులు తెలిపారు. పది ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు వస్తున్నాయని… ఒక్కొక్క బృందానికి ఆరుగురు చొప్పున ఉండనున్నారు. ఆ కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు సీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.