మధుర,హల్ద్వానీ: యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి గొంతుకోసి దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన బాలిక 20 రోజులు క్రితం నుండి కనిపించకుండాపోయినట్లు సమాచారం. అనుమానం వచ్చిన పోలీసులు ఫేస్‌బుక్‌ని తనిఖీ చేయగా, యమీన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు గుర్తించారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె పై అత్యాచారం చేసి గొంతుకోసి చంపినట్లు ప్రియుడు యమీన్ విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.