23.2 C
Hyderabad
Wednesday, February 11, 2026
spot_img

ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం జన్‌మన్ పథకం

        దేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పీఎం జన్‌మన్ పథకం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిం చారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ గా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని చెంచులతో సమావేశమై మాట్లాడారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నాగర్ కర్నూల్‌, వికారాబాద్ జిల్లాల్లో గిరిజనులు లబ్ధిపొందనున్నారు. ఈ పథకం అమలుతో 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసి తెగలను గుర్తించి 24వేల 104 కోట్లు కేటాయించగా, లక్ష ఇళ్లను నిర్మించనున్నారు. ఆదివాసీ గురుకుల విద్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజను లతో ప్రధాని మాట్లాడేందుకు డిజిటల్‌ తెర ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా పరిధిలోని అన్ని పెంటల నుంచి చెంచులు, చెంచు ప్రజాప్రతినిధులు మొత్తం 800 మందికి ఆహ్వానం పంపించారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిన పీఎం జన్‌మన్‌ పథకం అమలుపై సమావేశంలో వారికి మోదీ వివరించనున్నారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్‌ ఏర్పాటుతో పాటు అంశాలపై గిరిజనులతో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతారని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్