ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో పలువురు బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎపీ సీఎం అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్సి నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు ఆయన నివాసంలో జగన్ గడిపారు. వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ చర్చలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరిగి విజయవాడకు వెళ్లారు.