26.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

కాంగ్రెస్‌కు సీనియర్‌ నేత మిలింద్ దేవరా గుడ్‌ బై

       మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. ఎక్స్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

          ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేనకి కేటా యించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

         మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలిం ద్‌ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుధీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మురళీ దేవరాతో తనకు సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉందన్నారు. తాము ఎంతో అభిమానంతో ఉండేవాళ్లమని చెప్పారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది నంటూ స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్