ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

      తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూ ల్‌ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతవో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యం లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగుస్తుంది. 19వ తేదీన నామినేషన్‌ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్‌లు ఉప సంహరణకు గడువు కూడా ఇస్తారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Latest Articles

కోవిడ్‌ను మించిన వైరస్‌… లాక్‌డౌన్‌ తప్పదా?

మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్‌ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్