పల్నాడులో పోటా పోటీగా పండగ రాజకీయాలు

       ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి పండగను కూడా రాజకీయ లబ్ది చేకూరేలా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేం దుకు ఎవరి స్టైల్ లో వారు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో రాజకీయం మరింత పోటా పోటీగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ 28 వేల మెజారిటీతో గెలుపొందింది. ఈసారి రెట్టింపు ఓట్లు దండుకునేం దుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వస్తున్న వారిని కలిసేందుకు .. NRG పేరుతో పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణ పల్లి మెడికల్ కాలేజ్ ఆవరణలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

        ప్రతిపక్ష పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కూడా దాచేపల్లి లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశా రు. తనదైన శైలిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అన్ని గ్రామాల్లో సం క్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారందరిని సమావేశ పరిచి కలవనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీలకు మద్దతు కోరి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేస్తున్నారు. పోటాపోటీ ఆత్మీయ సమావేశాలతో పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్