గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు ?

       గల్లా జయదేవ్ సంగతేంటి ? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు టికెట్ల కేటా యింపులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి వేళ గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా ఈసారి బరిలో దిగుతారా ? లేక వేరే వారికి అక్కనుంచి అవకాశం ఇస్తారా ?

        ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు గల్లా జయదేవ్. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఆయన అందరికీ సుపరిచి తులే. అంతే కాదు.. అమర్‌ రాజా పేరుతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది గల్లా కుటుంబం. అరుణ కుమారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్ … 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

         వైసీపీ హవా బలంగా వీచిన 2019లోనూ ఎంపీగా గెలిచిన ఆయన.. గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి..ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో గల్లా జయదేవ్ మరోసారి గుంటూరు నుంచి బరిలో ఉంటారా లేక కొత్తగా ఇంకెవరైనా ఛాన్స్ ఇస్తారా అన్నదానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే… టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తున్న మాటల ప్రకారం రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణ యించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన.. పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

          మరి.. గల్లా పక్కకు జరిగితే గుంటూరు ఎంపీ బరిలో టీడీపీ తరఫున పోటీ చేయబోయేది ఎవరన్న ప్రశ్న తలెత్తు తోంది. అయితే.. ఆ స్థానం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో దిగొచ్చన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెనాలి నుంచి గతంలో పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన రాజా… ఈసారీ బరిలో దిగేందుకు రెడీ అయ్యా రు. అయితే … జనసేన పొత్తు కారణంగా ఆ స్థానం కేటాయించలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నెలకొంది. జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కావడమే ఇందు కు కారణం. దీంతో.. ఇప్పటి వరకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న చంద్రబాబు ముందు.. గల్లా జయదేవ్ నిర్ణయం కాస్త ఊరట నిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. జయదేవ్ తనంతట తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో ఆలపాటి రాజాను గుంటూరు ఎంపీ బరిలో దింపితే మధ్యేమార్గంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

        వాస్తవానికి వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి అంతగా ఆసక్తి చూపరు ఆలపాటి రాజా. కానీ, ప్రస్తుతం నెలకొన్న పొత్తు కారణాలతో ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం మాత్రమే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి… అధి నేత సూచనలకు రాజా ఏం చేస్తారు ? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్