Rahul Gandhi: నేడు పార్లమెంటులోకి రాహుల్ ?.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మోదీ ఇంటిపేరుపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) సూరత్‌ ట్రయల్ కోర్టు (Surat Court) విధించిన రెండేళ్ల ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ సోమవారం పార్లమెంట్‌లో అడుగు పెడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ స్పీకర్ ( Lok Sabha Speaker) నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

సూరత్ కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. శని,ఆది వారాలు పార్లమెంట్‌కు సెలవు. దీంతో సోమవారం రాహుల్‌గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ నేతలు అందజేశారు. అలాగే, రాహుల్‌ అనర్హతను రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి స్పీకర్ టేబుల్‌ ముందుంచారు. వీటిపై ఆయన సంతకం చేయడమే తరువాయి.. రాహుల్‌ సభలోకి వెళ్లేందుకు వీలుంటుంది. అయితే, ఆయన సోమవారమే సంతకం చేస్తారా? లేదంటే కొంత సమయం తీసుకుంటారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే, కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) మాత్రం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినంత వేగంగానే దానిని రద్దు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. లేదంటే మళ్లీ సుప్రీంకోర్టు(Supreme Court) గడపతొక్కే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష‘ఇండియా’ కూటమి కూడా ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్