ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగర వాసులకు పర్యాటక ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే ఏర్పాటు చేస్తామన్నారు. లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పారు. మున్నేరు వరద గండం లేకుండా 700 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేస్తామని తెలిపారు. 220 కోట్లతో ఫ్లడ్ వాటర్ మళ్లింపు కోసం డ్రైనేజ్ నిర్మాణం చేపట్టామన్నారు. రఘునాథపాలెం దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనాల్‌పై లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.