ఏపీలో పలుచోట్ల భగ్గుమన్న రాజకీయ కక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినా, పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పల్నాడులోని సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ ఘటనలో నాని సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు వెళ్లిన పులవర్తి నాని వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారింది. దాడిని నిరసిస్తూ బాధితులు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయప డ్డారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు.

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కొత్తగణేషునిపాడులో పోలింగ్ తరువాత ఉద్రిక్తతలు పెరి గాయి. టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. దీంతో ఆయా కుటుంబాల్లోని మహి ళలు రాత్రంతా గుడిలోనే తలదా చుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, అనిల్‌కుమార్‌ బాధితులను పరామర్శించారు.

పల్నాడులో తలెత్తిన ఘర్షణలపై వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులను పెద్ద ఎత్తున మార్చినా.. ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇది పోలీసుల వైఫల్యమని ఆరోపించారు.

మరోవైపు వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించి ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు. దాచేపల్లి మండలంలో పెట్రో బాంబు ఘటన బాధితులను ఆయన పరామర్శించారు. తంగేడ గ్రామంలో వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో కాసు మహేష్ రెడ్డి అనుచరులు గ్రామంలో పెట్రోల్ బాంబులతో దాడికి తెగబ డ్డారని విమర్శించారు. నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు.

పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసం అవ్వడంతో… పాటు టీడీపీ కార్యాలయం ధ్వంస మైంది.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్