తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుండి కొత్త కొత్త సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని వ్యాఖ్యానించారు. రెండేళ్లు కరోనా అతలకుతలం చేసింది, అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పటినుంచో ఉంది, జిల్లాను ఏర్పాటు చేసుకోవడమే కాదు.. నూతన కలెక్టరేట్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందిని అన్నారు.

వెనుకబడిన సామాజిక వర్గాన్ని ఆదుకోవడం కోసమే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాం. గొర్రెల పెంపకం తెలంగాణలో అద్భుతంగా కొనసాగుతోంది. మంచిర్యాల నుండే రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాం. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా అంశాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్లో దాటేసి నెంబర్.1 స్థానంలో తెలంగాణ నిలిచిందని అన్నారు.

Latest Articles

ఈత కొట్టడం ఇష్టమా? అయితే మీ స్కిన్‌, హెయిర్‌ రక్షించుకోండి ఇలా..

ఫుల్‌ బాడీ వర్కౌట్స్‌ చేయాలనుకుంటే అందులో ఈత గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. స్విమ్మింగ్‌ అనేది పూర్తి వ్యాయమంగా పరిగణించవచ్చు. ఇది గుండె ఆరోగ్యం, కండరాల బలం, మానసిక ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్