34.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

విడుదలైన తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ఇక.. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇక ఈ ఏడాది జ‌రిగిన ఇంట‌ర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణ‌త‌, సెకండియర్‌ 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసైతే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం. ఇంటర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి మొత్తం 9,48,153 మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

Latest Articles

హెచ్-1బి వీసాల విషయంలో భారతీయులు, చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా అధికారి

అమెరికా H-1B వీసా విధానంపై విమర్శలు చేస్తూ అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిల్కూర్ బాలాజీ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం వివాదానికి దారితీసింది. “వీసా టెంపుల్”గా పేరుగాంచిన ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్