అరెస్ట్‌ వారెంట్‌పై స్పందించిన సోనూసూద్‌..

తన అరెస్ట్‌ వారెంట్‌పై ప్రముఖ నటుడు సోనుసూద్‌ స్పందించారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానన్న తెలిపారు. సెలబ్రిటీలను టార్గెట్‌ చేయడం బాధాకరమని ఆయన అన్నారు.

కాగా మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు నటుడు సోనుసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్‌స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్‌ కౌర్‌ వారెంట్‌ జారీ చేశారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ ఖన్నా తనకు మోహిత్‌ శర్మ అనే వ్యక్తి 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో స్పందించిన సోనుసూద..సెలబ్రిటీలను టార్గెట్‌ చేయడం బాధాకరమని అన్నారు.

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్