రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరు.. ఎంపీ నిశీకాంత్ దూబే సెటైర్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: అసలు విపక్షాల కూటమిలో  విశ్వాసం ఉందా అని బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే (Nishikant Dubey) ప్రశ్నించారు. ఆ కూటమి సభ్యులకు ఇండియా అంటే  ఫుల్ ఫామ్  కూడా తెల్వదని సెటైర్లు వేశారు.  కేంద్రంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడిన దూబే..  ఇది మోడీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కాదని.. ఏ పార్టీ ఎవరి వైపు ఉందో తెలుసుకోవడానికి పెట్టిన తీర్మానం అని ఎద్దేవా చేశారు.

రాహుల్ సభకు వస్తే పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారని.. ఇంకా సుప్రీం తీర్పు ఇవ్వలేదని.. జస్ట్ స్టే మాత్రమే ఇచ్చిందన్న విషయం తెలుసుకోవాలని దూబే సూచించారు.  రాహుల్ గాంధీ (Rahul Gandhi) చర్చను ప్రారంభిస్తారనుకున్నాం కానీ ఆయన లేట్ గా నిద్రలేచినట్టున్నారని సెటైర్ వేశారు. లాలు, ములాయం, ఫరుఖ్ అబ్దుల్లాపై కేసు పెట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు.  మోడీ బీసీ కాబట్టే రాహుల్ కు సమాధానం చెప్పలేదన్నారు.  రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరని విమర్శించారు.

సోనియాగాంధీ తన కొడుకు, అల్లుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరారీలో ఉన్న ఓ మోసగాడితో సోనియా అల్లుడికి సంబంధాలున్నాయని ఆరోపించారు. 2024లో మీలో ఏ ఒక్కరూ లోక్ సభకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, మోడీని ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతారని దూబే పేర్కొన్నారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్