మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డి పటాన్‌చెరు పట్టణంలోని మార్నింగ్ వాకర్స్‌ని కలిశారు. వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. సంతలో పది రూపాయల లావాదేవీలు కూడా నేడు డిజిటల్, యూపీఏ ద్వారా జరుగుతు న్నాయన్నారు. అది కేవలం మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాలు సైతం మోదీని అభినందిస్తూ ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోదీని మూడోసారి ప్రధానిగా చేయాలని రఘునందన్ రావు కోరారు.
మార్నింగ్ వాకర్స్‌ని కలిసిన రఘునందన్ రావు
0
186
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


