33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

KTR : ప్రధానిగా మోదీ ఉన్నత కాలం పరిస్థితులు మారవు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే పార్లమెంట్‌(Parlament) ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్‌(Minister Ktr). యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో(Bhudan Pochampalli) చేనేత వారోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్…కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్‌(Brs) మద్దతు లేకుండా ఎవరూ ప్రధానమంత్రి కాలేరన్న ఆయన.. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నేతల్నే గెలిపించుకోవాలన్నారు.‌ కేసీఆర్ అయితే కేంద్రం మెడలు వంచగలరని, కొట్లాడగలరని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్‌.

మోదీ లాంటి వారు ఉన్నంతకాలం.. ఆయన ఆడిస్తే ఆడే డూడూ బసవన్నలు ఉన్నంతకాలం… పరిస్థితులు మారవన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేటీఆర్‌ అన్నారు. మూడు పంటలకు నీళ్లిచ్చే కేసీఆర్ కావాలా? మూడు గంటల కరెంట్‌ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్‌ కావాలా తేల్చుకోవాలని ప్రజలను కేటీఆర్‌ కోరారు. ఢిల్లీ పార్టీ నాయకులు కూర్చొవాలన్నా, నిలబడాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని, కాని తమ పార్టీ బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని కేటీఆర్‌  అన్నారు.

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. నెక్ట్స్‌ సీఎం ఎవరు?

పశ్చిమ బెంగాల్‌లో నూతన అధ్యాయం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించారు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై టీఎంసీకి కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్