కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త న్యాయ చట్టాలు ఈ ఏడాది జులై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతూ వచ్చిన IPC, CRPC, IEA వంటి చట్టాలకు అడ్డుకట్ట వేస్తూ దాదాపు 600 సవరణలు, మార్పులు చేసి కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది. కొత్త చట్టాల మీద అవగాహన కల్పించడంలో భాగంగా లా ఎక్స్ పర్ట్స్ తో వర్క్ శాప్ నిర్వహించింది. జవాబుదారితనం, విశ్వ సనీయత , న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దే చిరు ప్రయత్న మంలో భాగమే ఈ కొత్త చట్టాలనీ నల్సార్ యూని వర్శిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. కొత్త చట్టాల ద్వారా బాధితులకు న్యాయం తొందర గా జరుగుతుందని, తరచూ వాయిదాలు వేసే విధానం ఉందని మాజీ ఐపీఎస్ దామోదర్ తెలిపారు. చట్టం లో లోపాలను ఆసరాగా చేసుకునే విధానం కొత్త న్యాయ చట్టాల్లో ఉందని ఐపిఎస్ రాజ శేఖర్ అన్నారు.
జులై ఒకటి నుంచి అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు
0
192
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


