17 లక్షలు పెట్టి కారు కొంటే సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చారని ఓ బాధితుడు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్ నాగోల్‌లో చోటుచేసుకుంది. శివకుమార్ అనే వ్యక్తి నాగోల్‌లోని మారుతి సుజుకి నెక్సా కళ్యాణి మోటర్స్ షోరూంలో మే 18న గ్రాండ్ విటారా కారు బుక్ చేసుకున్నాడు. అయితే అప్పుడు రోజులు కావని కొద్ది రోజులు ఆగిన బాధితుడు జూన్ 7న కారు డెలివరీ తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఓనర్ కొత్త కారు పీపీ కోటింగ్ కోసం షోరూంకు వెళ్లాడు. ఆ సమయంలో రిపెయింటింగ్, ఇంజన్ పార్ట్స్ తుప్పు పట్టడం గమనించాడు. ఇదేంటని అడిగితే తమకు సంబంధం లేదని చెపుతూనే బాధితుడిపై షోరూం సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు యాక్సిడెంట్ అయిన కారుకి పెయింటింగ్ వేసి కొత్త కారు అని డెలివరీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో యాజమాన్యం, సిబ్బందిపై బాధితుడు కంప్లైంట్ చేశాడు.
నాగోల్ మారుతి సుజుకి నెక్సా కళ్యాణి మోటర్స్ షోరూంలో నయా మోసం
0
348
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


