మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు స్వతంత్ర సమరయోధులని, ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో ప్రాణాలు అర్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌రావు నివాళులు అర్పించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు సంస్మరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడారు. వెంకట్రావు విగ్రహానికి నివాళి అర్పించిన పొన్నం అనంతరం మొక్కలు నాటారు. ఎల్కతుర్తి ప్రాంతంలో భూస్వాములు, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందని మంత్రి పొన్నం ప్రస్తుతించారు. వెంకట్రావు తమ బిడ్డ అని, తమ ఊరికి గర్వకారణం అని గోపాల్‌పూర్ ప్రజలు అభిమానిస్తారని మంత్రి చెప్పారు. రైతాంగ సమస్యలు, నిరుపేదలకు భూములు పంచడం, కార్మికులకు వెంకట్రావు సేవలు ఆదర్శం అన్నారు.