బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి వినూత్న నిర్ణయం
నేడు ‘నో వెహికల్ డే’ పాటిస్తున్న సీఎం సామ్రాట్
సచివాలయానికి నడుచుకుంటూ వెళ్లిన బిహార్ సీఎం
కాన్వాయ్‌లో 21 వాహనాల నుంచి 3కే పరిమితం
ఇంధన పొదుపుపై ప్రజలకు సీఎం సామ్రాట్ పిలుపు
వారానికోరోజు ‘నో వెహికల్ డే’పాటించాలి- సామ్రాట్ చౌదరి
బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి (Samrat Choudhary) వినూత్న నిర్ణయం తీసుకుని ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నేడు ‘నో వెహికల్ డే’ పాటించారు.
ఈ సందర్భంగా సీఎం తన నివాసం నుంచి బిహార్ సచివాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో భారీ సంఖ్యలో వాహనాలు ఉండగా, సామ్రాట్ చౌదరి మాత్రం తన కాన్వాయ్‌ను 21 వాహనాల నుంచి కేవలం 3 వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ప్రజలు కూడా వారానికి కనీసం ఒకరోజైనా ‘నో వెహికల్ డే’ పాటించాలని పిలుపునిచ్చారు.


