ఏపీలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు, అల్లర్లు పెరిగాయని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మూడు నెలల్లో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమి జరగడం లేదన్నారు. రెడ్డ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని… సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని మండిపడ్డారు.