ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు . ఉదయం ముస్తాబాద్ మండలం బందనకల్ లో జాకీర్ అనే వ్యక్తి గృహప్రవేశానికి హాజరు కానున్నారు. అనంతరం గన్న వారిపల్లె లో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలు పరిశీలించనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అకాల వర్షానికి విద్యుత్ స్థంభం విరిగిపడి చనిపోయిన ఎల్సాని ఎల్లయ్య, నష్టపోయిన హోటల్ యజమాని రవి కుటుంబాలకు పరామర్శించిస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టణం షాదీఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. నిన్న రాత్రి రసూల్‌పురాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరయ్యారు. పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డితో కలిసి స్థానికులతో మాట్లాడారు. ‘రసూల్‌పురా యువ సేన’ అనే సంస్థ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహిం చింది. మైనారిటీ కమ్యూనిటీ యువత కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు, యువకులు, పిల్లలతో సహా ప్రజలతో కేటీఆర్ మాట్లాడారు. వారు ఉత్సాహంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. రసూల్‌పురాలోని గన్‌బజార్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి మైనార్టీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్