19.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

నేను పార్టీకి విధేయుడిని.. అప్పుడే చీఫ్‌గా బాధ్యతలు చేపడతాను: కిషన్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఢీల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.. తాను పార్టీకి విధేయుడనని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటా’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర కేబినేట్ భేటీకి వెళ్లకుండా కిషన్‌ రెడ్డి డీల్లీలోని తన నివాసంలోనే ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించడం ఇబ్బందికరమే. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం కిషన్‌ రెడ్డి డీల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనపై వారితో చర్చించే అవకాశం ఉంది. గురువారం ఉదయం కిషన్ రెడ్డి వరంగల్‌కు వెళ్తారు. జులై 8వ తేదీ వరకు కిషన్‌ రెడ్డి వరంగల్‌లోనే ఉండనున్నారు.

Latest Articles

ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్