31.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

నేడు నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పర్యటించడం లేదు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి కన్నుమూయడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిజామాబాద్ వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. బేగంపేట వద్ద ప్రత్యేక హెలికాప్టర్​లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి.. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు వేల్పూర్​కు వెళ్తారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. మంజులమ్మ భర్త వేముల సురేందర్‌రెడ్డి టీడీపీ హయాంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ (ప్రసుత బీఆర్ఎస్ ) రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఆయన మృతి చెందారు. మంజులమ్మకు ప్రశాంత్‌రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్‌(అజయ్‌)రెడ్డి, కుమార్తె రాధిక ఉన్నారు. మంజులమ్మ మృతిపై సీఎం సంతాపం ప్రకటించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్