25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

కన్నడ నాట కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సమరం

   రెండోవిడతలో భాగంగా కర్ణాటకలో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 14 నియోజక వర్గాల్లో 491 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు న్నాయి. కిందటేడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తమ పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి ఈసారి మెజారిటీ సీట్లు గెలవాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా హస్తం పార్టీ చెమటోడుస్తోంది. అయితే కిందటేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఐదు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాన్ని ఏ రోజూ తెచ్చు కోలేదు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. కన్నడనాట గత పాతికేళ్లలో కాంగ్రెస్ అందుకున్న అతి పెద్ద విజయం ఇదే.

    ఈసారి కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. 1999 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన హస్తం పార్టీ మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని పరాభవాన్ని ఎదుర్కొంది. అప్పటి ఎన్నికల్లో దేవెగౌడ నాయకత్వంలోని జేడీ ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జేడీఎస్‌కు తొమ్మిది సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒకే ఒక్కస్థానంలో గెలిచింది. కాగా ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో పాత పరాజయాన్ని మరచి పోయింది హస్తం పార్టీ. కర్ణాటకలో ఈసారి మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే స్వంత రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటు న్నారు. కన్నడనాట అత్యథిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే మల్లికార్జున ఖర్గే నాయకత్వానికే అది మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపుతున్నారు. ఈ సారి యువకులు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చింది హస్తం పార్టీ.

  2019 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.36 శాతం ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఈసారి బీజేపీ స్వంతంగా 370 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. 370 సీట్లు సాధించడంలో కర్ణాటక ఎన్నికలు కీలకంగా మారాయి. 2019 ఎన్నికల్లో దక్షిణాదినగల ఐదు రాష్ట్రాల్లో బీజేపీ కేవలం 35 సీట్లనే గెలుచుకుంది. ఈసారి దక్షిణాదిన 50 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. ఇందులో కనీసం సగం సీట్లు కర్ణాటకలోనే సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి బీజేపీ 25 సీట్లు సాధించడం అనుకున్నంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన వివిధ పథకాలు తమకు ప్లస్ పాయింట్లు అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టున్న జేడీఎస్‌తో పొత్తు కుదరడం బీజేపీకి కలిసివచ్చే అంశం.బీజేపీకి, జేడీఎస్‌కు మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. అయితే హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం తో బీజేపీకి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడం అనివార్యమైంది. జనతాదళ్‌ నుంచి విడిపోయి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జేడీఎస్ ఏర్పడింది. అయితే జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి. ఇదొక విశేషం. ఈసారి కర్ణాటకలో బీజేపీ 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో నూ అలాగే జేడీఎస్ మూడు నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తోంది.

        రెండో విడత ఎన్నికల్లో బరిలో ఉన్నవారిలో జేడీ ఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఉన్నారు. మాండ్యా నుంచి కుమారస్వామి పోటీలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట రమణే గౌడ పోటీ చేస్తున్నారు. అలాగే జేడీఎస్‌కు చెందిన మరో ప్రముఖుడు రేవణ్ణ, హసన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. రేవణ్ణపై కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రేయాస్ పటేల్ గౌడ పోటీలో ఉన్నారు. కాగా దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ యువ నేత తేజస్వి సూర్య పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తేజస్వి సూర్య ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మరోసారి విజయం కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. మైసూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై యదువీర్ వడియార్ పోటీలో ఉన్నారు. మైసూర్ సంస్థానం వారసుడు యదువీర్ వడియార్. 2019 ఎన్నికల్లో మైసూర్ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ టికెట్‌ పై ప్రతాప్ సింహ గెలిచారు. ఈసారి ప్రతాప్ సింహను కాదని యదువీర్ వడియార్‌ను బరిలో నిలిపింది బీజేపీ అగ్ర నాయకత్వం. ఇదిలా ఉంటే బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై డీకే సురేష్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి డీకే సురేష్ పోటీ చేసి గెలిచారు. మరోసారి విజయం సాధిస్తానంటున్నారు సురేష్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడే డీకే సురేష్. దీంతో బెంగళూరు రూరల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం మీద రెండో విడతలో ఆధిక్యత సాధించడానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్