ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi)ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( G. Kishan Reddy) ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కోసం ఇప్పటికే లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రలో వెయ్యి ఎకరాల లోపే భూములు ముంపునకు గురవుతాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్… ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీని తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


