25.7 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

ఆచంటలో వైసీపీ అభ్యర్థి గెలుపు సాధ్యమేనా ?

       చుట్టూ పచ్చని పంట పొలాలు.. ఆ పక్కనే గలగలా ప్రవహించే గోదావరి.. మరోవైపు పురాతల ఆలయాలు .. ఇలా ఆహ్లాదం.. ఆధ్యాత్మికత కొలువు తీరిన ప్రాంతం ఆచంట నియోజకకవర్గం. ఇక్క డ్నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. 2019లో గెలిచిన ఆయన ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏయే అభివృద్ధి పనులు చేశారు ? స్థానిక ఓటర్లు ఏమంటున్నారు ?

    ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతంతో ఉన్న నియోజకవర్గం ఆచంట. ఇక్కడ్నుంచి 2014, 2019లో వరుసగా రెండు సార్లు గెలుపొందారు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. హోరాహోరీగా సాగిన 2019 ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగింది. నాటి ఎన్నికల్లో వైసీపీ నుంచి చెరుకువాడ బరిలో దిగగా.. టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ, జనసేన నుంచి జువ్వాడి వెంకట విజయరామ్ పోటీ చేశారు. నాటి పోరులో చెరుకువాడ శ్రీరంగనాథ రాజు 12 వేల 886 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్‌లో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు.

   శ్రీరంగనాథ రాజు గెలిచి మంత్రి అయినప్పటికీ..ఆచంటలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అనే అభిప్రాయం ఎక్కువగా విన్పిస్తోంది. ఎక్కడి దాకో ఎందుకు సీఎం జగన్ ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. మరి.. ఎమ్మెల్యేగా శ్రీరంగనాథ రాజు చేసింది ఏంటీ అంటే.. ప్రభుత్వం తరఫున అమలు చేసిన సంక్షేమ పథకాల పర్యవేక్షణే అన్న మాట ఎక్కువగా విన్పిస్తోంది. నవరత్నాల అమలులో భాగంగా గ్రామాలు, మండలాల వారీగా సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వాలంటీర్లు ఆయా పథకాలను అందిస్తున్న విధానాన్ని ఎక్కువగా ఎమ్మెల్యే పర్యవేక్షించేవారని.. అంతకు మించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదనే చెబుతున్నారు. చివరకు డ్రైనేజీల లాంటి మౌలిక వసతుల కల్పన విషయంలోనూ ఎమ్మెల్యే ఘోరంగా ఫెయిలయ్యారని అంటున్నారు. ఇదే విషయం అధిష్టానం జరిపిన అంతర్గత సర్వేల్లోనూ బయటపడిందని.. అందుకే మొదట్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని సైతం తీవ్రంగా ఆలోచించారని చెబుతున్నారు స్థానిక ఓటర్లు.

  రాజు గెలిచారు.. మంత్రి అయ్యారు.. అయినా అభివృద్ధి ఏ మాత్రం లేదన్న వాదన బలంగా విన్పిస్తోంది. ప్రధానంగా నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. దీంతో..డ్రైనేజీ వ్యవస్థ చాలా కీలకం. కానీ, అదే సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు పారిశుద్ధ్య లోపం కూడా వేధిస్తుండడంతో దోమల బెడద అధికంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇక, పేరుకు గోదావరి నది పక్కనే ఉన్నా.. తాగు నీటికి వెతుక్కోవాల్సిన దుస్థితి ఇక్కడి గ్రామాల ప్రజలది. ఇక, లంక గ్రామాల ప్రజల ఇబ్బందులైతే చెప్పన లవి కాదు. దీంతో.. వంతెనల నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్లు ఏళ్ల తరబడి విన్పిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేరన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

  నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నా.. అన్నింటిలోనూ కనీసం మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఇక, ఫైర్ స్టేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా నేటికీ ఆ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇక, వైద్య సదుపాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే.పేరుకు ఆచంటలో 30 పడకల ఆస్పత్రి ఉన్నా మెరుగైన సౌకర్యాలు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక, మార్టేరు, పోడూరు, పెనుగొండ పీహెచ్‌సీల్లోనూ పూర్తి స్థాయి వైద్య సేవలు అందకపోవడం మరింత సమస్యగా మారింది. సరైన ఆస్పత్రి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ప్రైవేటు ఆస్పత్రుల కోసం దూర ప్రాంతాలకు పరిగెత్తా ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

 కేవలం ఇవే కాదు.. నియోజకవర్గంలోని 54 గ్రామాలకు గోదావరి జలాలను శుద్ధి చేసి అందిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ, నేటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో ఒక్కో పట్టాను అధికార పార్టీ నాయకులు 50 వేల నుంచి 80 వేలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు విన్పిస్తు న్నాయి. ఇవి ఎమ్మెల్యేకు తెలిసే జరిగాయని ఆరోపిస్తున్నారు స్థానిక విపక్ష నాయకులు. మరో వైపు.. గోదావరి నదీగర్భం వెంబడి కోట్లాది రూపాయల మేర ఇసుక అక్రమ రవాణా కొనసాగించారన్న ఆరోపణలు సైతం ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. శ్రీరంగనాథరాజు ముఖ్య అనుచరుడు నరేష్‌ సహా పలువురిపై భూదందా ఆరోపణలు విన్పిస్తుండడంతో.. పరోక్షంగా ఈ వ్యవహా రంలో ఎమ్మెల్యే పేరుపైనా ప్రచారం సాగుతోంది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేగా శ్రీరంగనాథ రాజు పనితీరు కు వందకు యాభై మార్కులు వేశారు ఆచంట నియోజకవర్గ ప్రజలు.ఎమ్మెల్యేగా చెప్పింది ఎంతో .. చేసింది కొంతే అన్నట్లుగా ఈ ఐదేళ్ల పాటు చెరుకువాడ పాలన సాగిందన్న విమర్శలున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మరోసారి ఆచంట బరిలో ఉన్నారు. మరి.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్