టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీతోనూ భేటీ కాను న్నారు. ఈ మేరకు భారత పర్యటన, ప్రధానితో భేటీని ధ్రువీకరిస్తూ ఎక్స్ వేదికగా మస్క్ స్పందిం చారు. మోదీతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా దేశం లో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఢిల్లీలో ఏప్రిల్ 22న ప్రధానితో మస్క్ భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపై తన ప్రణాళికలను వేరేగా వెల్లడించను న్నారని పేర్కొన్నాయి. విద్యుత్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం టెస్లా ప్రతినిధులు భారత్‌లో సందర్శించనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ నెలలోనే ఈ పర్యటన ఉంటుందని ప్రచారం జరిగింది. మరోవైపు టెస్లా ప్లాంట్‌ను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. టెస్లాతో సంప్రదింపులు జరుపుతు న్నట్లు తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది.
భారత్‌లో పర్యటించనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్
0
164
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


