35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ ప్రారంభం

భారతీయ చలనచిత్ర రంగంలో పాన్-ఇండియా నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఆయన కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ‘సీతా రామం’ తర్వాత ఆయన డైరెక్టర్ వెంకీ అట్లూరితో తెలుగులో తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ను ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలను అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చురుకైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఆ నిర్మాతలు ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు. సార్/వాతి తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో ఇది వారి రెండో పాన్-ఇండియా చిత్రం. ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు పాల్గొని సినిమాపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఒక సాధారణ మనిషి  చేసే అసాధారణమైన ప్రయాణమే ‘లక్కీ భాస్కర్’ కథాంశం. ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి అసాధారణమైన ప్రయాణంగా ఈ చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
డి ఓ పి: నిమిష్ రవి
ఆర్ట్ డైరెక్టర్: వినీష్ బంగ్లాన్
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Latest Articles

వైద్యుల అనధికారిక సెలవులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్వాసన

అమరావతి: అనధికారికంగా విధులకు గైర్హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్