Telangana University | నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్శిటీలో ఉపాధ్యాయ సిబ్బంది తొలగింపు చర్చనీయంశంగా మారింది. మొత్తం 140 మంది సిబ్బందిని వర్శిటీ యాజమాన్యం తొలగించింది. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి.. యూనివర్సిటీలో స్తానం పొందినట్లు గుర్తించిన యాజమాన్యం.. సిబ్బందిని తొలగించింది. దీంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది రోడ్డునపడ్డారు. బాధితుల్లో స్వీపర్లు, అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లు.. వీసీని కలిసి తమ డబ్బులు తిరిగివ్వాలని కోరారు.